Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఐస్‌క్రీమ్స్ (Ice Cream) అంటే మహా ఇష్టం. ఈ విషయాన్ని అధ్యక్షుడే పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు. చాలా సార్లు బైడెన్ ఐస్‌క్రీం తింటూ కనిపించారు కూడా. అయితే, తాజాగా ఐస్‌క్రీంపై తనకున్న ప్రేమను బైడెన్ మరోసారి బయటపెట్టారు. తనకు నిజంగా గొప్ప ఐస్‌క్రీం ప్రదేశాలు (Great Ice Cream Places) తెలుసునని వ్యాఖ్యానించారు. కావాలంటే పిల్లలు తనని సంప్రదిస్తే సాయం చేస్తానంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
వైట్‌హౌస్‌లో జరిగిన ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం (Inflation Reduction Act ) మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న బైడన్.. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘ పిల్లలకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ కొన్ని గొప్ప ఐస్‌క్రీం ప్రదేశాలు తెలుసు. మీకూ కావాలంటే నాతో మాట్లాడండి.. సాయం చేస్తాను’ అంటూ చమత్కరించారు. ప్రస్తుతం బైడెన్ సరదా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Jailer Movie | రజినీ కావాలయ్యా పాటకు జపాన్ అంబాసిడర్ స్టెప్పులు.. వీడియో వైరల్
Mud Tsunami | ఇటలీని ముంచెత్తిన బురద ప్రవాహం.. వీడియో
Manipur | భారీ వర్షానికి విరిగిపడ్డ కొండచరియలు.. హైవేపై నిలిచిపోయిన 500 గూడ్స్ ట్రక్కులు