Kochi Mall | బుర్ఖా ధరించి మహిళల వాష్‌రూమ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి.. వీడియో రికార్డు చేస్తూ..
Kochi Mall | కేరళ (Kerala)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బుర్ఖా ధరించి (Wearing Burqa) మహిళల వాష్‌రూమ్ (Womens Toilet)లోకి ప్రవేశించి తన ఫోన్లో వీడియోలు రికార్డు ( Records Videos) చేశాడు.
Kochi Mall | కేరళ (Kerala)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బుర్ఖా ధరించి (Wearing Burqa) మహిళల వాష్‌రూమ్ (Womens Toilet)లోకి ప్రవేశించాడు. ఈ ఘటన కొచ్చిలోని ఓ ప్రముఖ మాల్ (Kochi Mall )లో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
23 ఏళ్ల యువకుడు కొచ్చిలోని ఫేమస్ లులు మాల్ (Lulu Mall)ను సందర్శించాడు. అక్కడ బుర్ఖా ధరించి మాల్లోని మహిళల వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి తన ఫోన్లో వీడియోలు రికార్డు ( Records Videos) చేశాడు. రహస్య కెమెరాను వాష్‌రూమ్‌లోని డోర్‌కు అంటించాడు. ఆ తర్వాత బయటకు వచ్చి వాష్‌రూమ్ మెయిన్ డోర్ ముందు నిలబడ్డాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మహిళ వేషం వేసుకుని వాష్‌రూమ్‌లోని దృశ్యాలను తన మొబైల్లో రికార్డు చేస్తున్నట్లు తేలింది.
నిందితుడి నుంచి బుర్ఖా, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సదరు యువకుడు ఇన్ఫోపార్క్‌లోని ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు అతడిపై ఐపీఎస్ సెక్షన్లు 354 (సీ), 419, 66ఈ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అతన్ని స్థానిక కోర్టులో హాజరుపరచగా నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు కలమసేరి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. నిందితుడు గతంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
Jailer Movie | రజినీ కావాలయ్యా పాటకు జపాన్ అంబాసిడర్ స్టెప్పులు.. వీడియో వైరల్
Mud Tsunami | ఇటలీని ముంచెత్తిన బురద ప్రవాహం.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

