Congress Leader Dies Of Snakebite | ఉప ఎన్నిక పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత.. పాము కాటుతో మృతి
Congress Leader Dies Of Snakebite | రాత్రి వేళ కారు నుంచి దిగిన కాంగ్రెస్ నేతను పాము కాటు వేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇటీవల రద్దైన అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆయన మృతి పట్ల ఆ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
పనాజీ: రాత్రి వేళ కారు నుంచి దిగిన కాంగ్రెస్ నేతను పాము కాటు వేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇటీవల రద్దైన అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రధాన అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆయన మృతి పట్ల ఆ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. (Congress Leader Dies Of Snakebite) గోవాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత 38 ఏళ్ల కేతన్ భటికర్, గురువారం రాత్రి కర్ణాటకలోని దండేలి గ్రామానికి కారులో బయలుదేరారు.
కాగా, గోవా-కర్ణాటక సరిహద్దులోని కర్మాళ్ ఘాట్ వద్ద కేతన్ తన కారు నుంచి కిందకు దిగారు. ఒక పాము ఆయనను కాటు వేసింది. కేతన్ను వెంటనే గోవాలోని ధర్బందోరాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.
మరోవైపు పోండా సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే రవి నాయక్ 2025 అక్టోబర్ 15న మరణించడంతో ఏప్రిల్ 9న ఉప ఎన్నిక జరుగాల్సి ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థిగా కేతన్ భటికర్ పోటీలో ఉన్నారు. అయితే శాసనసభ పదవీకాలం ఏడాది లోపే ముగియనున్నందున ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంతో ఉప ఎన్నిక కోసం ఈసీ జారి చేసిన నోటిఫికేషన్ను బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఏప్రిల్ 8న రద్దు చేసింది. దీంతో పోండాలో జరుగాల్సిన ఉప ఎన్నిక నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేతన్ భటికర్, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయన దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్ ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది. ఈ తరుణంలో పాటు కాటు వల్ల కేతన్ భటికర్ మరణించడంపై గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

