Heart Stroke | అహ్మదాబాద్ : ఓ ఎనిమిదేండ్ల చిన్నారి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. తరగతి గదిలోకి వెళ్తున్న క్రమంలో ఆ చిన్నారి కుప్పకూలిపోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లోని జీబార్ స్కూల్లో ఓ ఎనిమిదేండ్ల చిన్నారి మూడో తరగతి చదువుతుంది. శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఆ పాప.. తన తరగతి గదిలోకి వెళ్తూ.. లాబీల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది. క్షణాల్లోనే చైర్లోనే కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని అక్కడున్న విద్యార్థులు, టీచర్లు గమనించారు. కాసేపటి తర్వాత విద్యార్థిని కుప్పకూలిపోవడాన్ని గమనించిన ఓ టీచర్ సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ షర్మిష్ట సిన్హా మాట్లాడుతూ.. ఆ చిన్నారికి ఎలాంటి అనారోగ్య కారణాలు లేవు. శుక్రవారం ఉదయం ఆ పాప కుర్చీలో కూర్చుని ప్రాణాలు విడిచిందని తెలిపారు. చిన్నారి మృతిపట్ల సంతాపం ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. తోటి విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు.
ఇక విద్యార్థిని తల్లిదండ్రులు ముంబైలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. పాన తన గ్రాండ్ పేరెంట్స్‌తో అహ్మదాబాద్‌లో ఉంటూ చదువుకుంటుంది. బిడ్డ మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.
సీసీ ఫుటేజ్.. గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి
గుజరాత్ – అహ్మదాబాద్‌లో
మూడో తరగతి విద్యార్థిని గార్గి(8) క్లాస్‌కి వెళ్తుండగా అస్వస్థతకు గురైందిఅయితే అక్కడే ఉన్న చైర్లో కూర్చున్న ఆమె అలాగే కుప్పకూలిపోయి మృతిచెందింది. pic.twitter.com/F4m2KfoJwr
— Telugu Scribe (@TeluguScribe) January 11, 2025
ఇవి కూడా చదవండి..
IED Blast : చత్తీస్‌ఘడ్‌లో ఐఈడీ పేలుడు.. సీఆర్పీఎఫ్ జవానుకు గాయాలు
Madhya Pradesh: 8 నెలలుగా ఫ్రిడ్జ్‌లో మహిళ మృతదేహం.. లివిన్ పార్ట్నర్ను చంపిన వ్యక్తి
PM Modi | నేనూ మనిషినే.. దేవుడిని కాదు.. పొరపాట్లు చేసి ఉండొచ్చు : మోదీ