భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని దివాస్‌లో సహజీవనం చేస్తున్న మహిళను చంపేశాడు ఓ వ్యక్తి. అయితే ఆమెకు చెందిన మృతదేహాన్ని ఓ ఫ్రిడ్జ్‌లో గుర్తించారు. సుమారు 8 నెలల నుంచి రిఫ్రిజిరేటర్‌లోనే ఆమె శవం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. శుక్రవారం ఓ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి ఆ మహిళ శవాన్ని వెలికి తీశారు. చీరలో ఉన్న ఆమె చేతుల్ని కట్టేశారు. మెడలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. నిందితుడు సంజయ్ పటిదార్ తన ఇంటిని కిరాయి ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలను పింకీ ప్రజాపతిగా గుర్తించారు. ఆమెను గత ఏడాది జూన్‌లో హత్య చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.
నిందితుడు పటిదార్ .. ఉజ్జయిన్ నివాసి. గత అయిదేళ్లతో నుంచి బాధిత మహిళతో అతను లివిన్ రిలేషన్లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని వత్తిడి చేయడం వల్లే.. పటిదార్ ఆ మహిళను చంపి ఉంటారని భావిస్తున్నారు. స్నేహితుడి హెల్ప్ తీసుకుని హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఇంట్లో నుంచి చెడు వాసన రావడంతో.. ఓనర్‌ను పిలిపించారు. అయితే ఓ రూమ్‌ను తెరవగా దాంట్లో ఉన్న ఫ్రిడ్జ్‌లో మహిళ శవాన్ని గుర్తించారు. ఇంటి ఓనర్ ధీరేంద్ర శ్రీవాత్సవ్.. ఇండోర్‌లో ఉంటాడు.