న్యూఢిల్లీ : స్కూల్ ఫంక్షన్లో అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో చిన్నారి అందరి మన్ననలు అందుకుంది. స్కూల్లో దివాళీ వేడుకల సందర్భంగా చిన్న పాప వేసిన డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
प्रतिभा देखिये।👏🔥 pic.twitter.com/XzqxFCSAIm
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 9, 2022
ఈ వైరల్ వీడియోలో మేరా బల్మా బడా సయన అనే సాంగ్‌కు ఆ పాప డ్యాన్స్ చేస్తుండటం కనిపించింది. పాప కిల్లర్ మూమెంట్స్‌తో కూడిన ఈ వీడియోకు ఇప్పటివరకూ ట్విట్టర్లో 45,000కుపైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో స్కూల్ యూనిఫాం ధరించిన పాప రాజస్ధానీ సాంగ్‌కు హుషారైన స్టెప్స్‌తో అలరించింది.
వందలాది స్కూల్ విద్యార్ధులు, టీచర్లు క్లాప్స్ కొడుతుండగా చిన్నారి అద్భుతమైన స్టెప్స్‌తో ఆకట్టుకుంది. పాప పెర్ఫారెన్స్కు అద్భుత ప్రోత్సాహం లభించిందని ఓ యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. స్కూల్ రోజుల కంటే అందమైనవి ఏముంటాయని మరో యూజర్ కామెంట్ చేశారు.