శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Sep 15, 2020 , 14:17:56

ప‌ద‌హారేండ్ల బాలిక‌పై రెండేండ్లుగా అత్యాచారం!

ప‌ద‌హారేండ్ల బాలిక‌పై రెండేండ్లుగా అత్యాచారం!

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం సాత్నా జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ ప‌ద‌హారేండ్ల బాలిక‌పై 40 ఏండ్ల వ్యాపారి గ‌త రెండేండ్లుగా అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. రెండేండ్లుగా వ్యాపారి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ్డ‌ బాధితురాలు ఎట్ట‌కేల‌కు ధైర్యం చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. స‌ద‌రు వ్యాపారి రెండేండ్లుగా త‌న‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడ‌ని బాలిక పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న‌ది. 

బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన కొల్గ‌వాన్‌ పోలీసులు.. నిందుతుడు స‌మీర్ అలియాస్ అతీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ఇంటారాగేష‌న్ చేయ‌గా మ‌రిన్ని అకృత్యాల‌కు వెలుగులోకి వ‌చ్చాయి. మ‌హిళ‌ల‌ను మాయ మాట‌ల‌తో లోబ‌ర్చుకోవడం, బ్లాక్ మెయిల్ చేసి డ‌బ్బులు గుంజ‌డం, పెండ్లి పేరుతో మోసాలు చేయ‌డం లాంటివి బ‌య‌ట‌ప‌డ్డాయి. తాజాగా ఫిర్యాదు చేసిన బాలిక‌తోపాటు మ‌రో ఆరుగురు మ‌హిళ‌ల‌ను అత‌ను ఇదేవిధంగా మోసం చేసిన‌ట్లు తేలింది. 

కాగా, త‌మ‌పై వ్యాపారి అఘాయిత్యాల గురించి చెప్పిన స‌ద‌రు మ‌హిళ‌లు అత‌నిపై ఫిర్యాదు చేసేందుకు మాత్రం నిరాక‌రించారు. అయితే, పోలీసులు నిందితుడి ఇల్లు, జిమ్‌, సైబ‌ర్ కేఫ్‌ల‌పై ఏక కాలంలో సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో సాత్నా, రేవా జిల్లాల‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల లెట‌ర్‌హెడ్‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. వీఐపీ కోటాలో రైళ్ల‌లో ఉచితంగా ప్ర‌యాణించ‌డం కోసం నిందితుడు ఆ లెట‌ర్ హెడ్‌ల‌ను ఉప‌యోగిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo