Jyoti Malhotra | గూఢచర్యం (spying) కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసు దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఐఎస్ఐ హ్యాండ్లర్ (ISI Handler)తో జ్యోతి చాటింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. అందులో తనని పాకిస్థాన్‌లో పెళ్లి చేసుకోవాలంటూ (Get me married in Pakistan) జ్యోతి కోరడం గమనార్హం.
ఐఎస్ఐతో సంబంధాలున్న అలీ హసన్ (Ali Hasan) అనే వ్యక్తితో జ్యోతి నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు అధికారులు తమ దర్యాప్తులో ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. భారత్‌కు సంబంధించిన రహస్య కార్యకలాపాల గురించి వీరిద్దరూ చర్చించుకున్నట్లు తేల్చారు. వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫారమ్‌లను వినియోగించినట్లు విచారణలో తేలింది. స్నాప్‌చాట్, టెలిగ్రామ్, వాట్సాప్‌లో కోడ్ ల్యాంగ్వేజ్‌లో మాట్లాడుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. భారతదేశ అండర్‌కవర్ ఆపరేషన్లకు సంబంధించి సంకేత భాషలో వారి మధ్య సాగిన సంభాషణలు దర్యాప్తు బృందానికి లభించాయి. చాటింగ్ సందర్భంగా ‘నన్ను పాకిస్థాన్‌లో పెళ్లి చేసుకోవాలి’ అని జ్యోతి కోరింది. ఇందుకు సంబంధించిన చాటింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.
మరోవైపు పాక్ ఇంటెలిజెన్స్ అధికారుల (Pakistani intelligence officials)తో తనకు సంబంధాలున్నట్లు జ్యోతి అంగీకరించినట్లు తెలిసింది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో తాను నిత్యం టచ్‌లో ఉండేదాన్ని ఆమె దర్యాప్తు అధికారుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్‌కు వెళ్లిన సమయంలో డానిష్‌తో తొలిసారి పరిచయం ఏర్పడినట్లు వెల్లడించింది.
Also Read..
“Jyoti Malhotra | బ్లాకౌట్ వివరాలను పాక్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేసిన జ్యోతి మల్హోత్ర..!”
“Jyoti Malhotra | జ్యోతి మల్హోత్రాపై ప్రశ్నల వర్షం.. వెలుగులోకి కీలక విషయాలు”
“Jyoti Malhotra | యూట్యూబర్ జ్యోతికి షాక్.. ఇన్‌స్టా ఖాతా సస్పెండ్”