German Singer | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో రామ్ లల్లా విగ్రహ (Ram Lalla Idol) ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో భారత్ మొత్తం శ్రీరాముడి నామంతో మార్మోగిపోతోంది. ప్రజలు రామ భక్తిలో పరవశించిపోతున్నారు. రాముడి దర్శనం కోసం దేశ ప్రజలేకాదు.. విదేశీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన ప్రముఖ గాయని (German Singer) కాసాండ్రా మే స్పిట్మన్ Cassandra Mae Spittmann).. రాముడిపై తనకున్న భక్తిని చాటుకుంది. శ్రీరాముడికి సంబంధించి ఓ అందమైన పాటను తనదైన శైలిలో ఆలపించి ఆకట్టుకుంది. ‘రామ్ ఆయేంగే..’ అంటూ సాగే ఈ పాట భారతీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
#WATCH | Duisburg, Germany | German Singer Cassandra Mae Spittmann sings the devotional song ‘Ram Aayenge’.
Her rendition of the Ram Bhajan has gone viral on social media. pic.twitter.com/tAYYRP9SCW
— ANI (@ANI) January 18, 2024
Also Read..
Ram Lalla Idol | రామ్ లల్లా తొలి ఫొటో రిలీజ్.. నల్లటి పద్మపీఠంపై దర్శనమిచ్చిన బాలరాముడు
Pm Modi | ప్రాణప్రతిష్టకు ముందు భక్తి పారవశ్యంలో మోదీ.. 62 రామభక్తి గీతాలను షేర్ చేసిన ప్రధాని
Ram Mandir | ప్రపంచంలోనే ఎత్తైన రామాలయం.. 600 కోట్లతో ఆస్ట్రేలియాలో నిర్మాణం