Ram Mandir | న్యూఢిల్లీ, జనవరి 18: రామ భక్తులకు మరో శుభవార్త. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రామాలయం ఆస్ట్రేలియాలో నిర్మాణం కానుంది. 721 అడుగుల ఎత్తుండే ఈ ఆలయాన్ని సుమారు రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. 150 ఎకరాల విస్తీర్ణంలో శ్రీరామ్ వేదిక్, కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెర్త్‌లో ఇది రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా ప్రాజెక్టు గురించి ట్రస్ట్ డిప్యూటీ హెడ్ హరేంద్ర రాణా వివరిస్తూ భారీయెత్తున ఆలయాన్ని నిర్మిస్తామని, ఆలయ కాంప్లెక్స్ ప్రాంగణాన్ని ఆకర్షణీయమైన కట్టడాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు.