భారత్‌లోనే ఇంధన భారం అధికం!
ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ వినియోగిస్తున్న దేశాల్లో భారత్‌లోనే వాటి ధరలు అధికంగా ఉన్నట్టు ఓ వెబ్సైట్ వెల్లడించింది. దేశ సగటు తలసరి ఆదాయంతో సమానంగా సంపాదించే భారతీయుడు తన ఒకరోజు వేతనంతో కేవలం ఎనిమిది లీటర్ల పెట్రోలు లేదా డీజిల్ మాత్రమే కొనుగోలు చేయగలడు.
- సగటు భారతీయుడు ఒక రోజు వేతనంతో కొనగలిగేది 8 లీటర్ల పెట్రోలే
- పది బడా ఆర్థిక వ్యవస్థల్లో భారత్ చివరి స్థానం
- బ్రెజిల్లో చమురు ధరలు మనకన్నా చౌక
- చమురు కంపెనీలు లాభాల్లో ఉన్నా.. ధరల మోత
న్యూఢిల్లీ, జూన్ 1: ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ వినియోగిస్తున్న దేశాల్లో భారత్‌లోనే వాటి ధరలు అధికంగా ఉన్నట్టు ఓ వెబ్సైట్ వెల్లడించింది. దేశ సగటు తలసరి ఆదాయంతో సమానంగా సంపాదించే భారతీయుడు తన ఒకరోజు వేతనంతో కేవలం ఎనిమిది లీటర్ల పెట్రోలు లేదా డీజిల్ మాత్రమే కొనుగోలు చేయగలడు. ప్రపంచంలోని పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్‌లో ఇది అత్యంత తక్కువ పరిమాణం అని ఓ ఆంగ్ల దినపత్రిక పేర్కొన్నది. ఇదే సమయంలో సగటు అమెరికన్ తన ఒక రోజు సంపాదనతో 199 లీటర్ల పెట్రోలు, 171 లీటర్ల డీజిల్ కొనుగోలు చేయగలడని వివరించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇంధన ధరలను వెల్లడించే గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్ కామ్ ఆధారంగా ఈ గణాంకాలను అంచనా వేసినట్టు ఆ పత్రిక వివరించింది. భారత్‌తో పోల్చుకుంటే ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, జపాన్‌కు చెందిన పౌరులు తమ ఒక రోజు వేతనంతో 50 లీటర్ల పెట్రోలు లేదా డీజిల్ కొనుగోలు చేయగలరని తెలిపింది.
ప్రపంచంలోని పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 9వ స్థానంలో ఉన్న బ్రెజిల్లో సైతం భారత్ కన్నా పెట్రో ధరలు తక్కువగా ఉన్నాయి. ఓ సగటు బ్రెజిలియన్ తన రోజువారీ వేతనంతో 20 లీటర్ల పెట్రోలు లేదా డీజిల్ కొనుగోలు చేయగలడని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 158 దేశాల్లో లిబియాలో మాత్రమే ఇంధన ధరలు అతి తక్కువగా ఉన్నట్టు తెలిపింది. లిబియా పౌరుల తమ రోజువారీ ఆదాయంతో 789 లీటర్ల పెట్రోలు లేదా డీజిల్ కొనుగోలు చేయగలరని పేర్కొన్నది. ఇక డీజిల్ అత్యంత చౌకగా లభించే దేశాల్లో వెనిజువెలా మొదటి స్థానంలో ఉండగా, ఇరాన్ రెండో స్థానంలో ఉన్నది. వెనిజువెలాలో ఒకరోజు కూలీతో 2,573 లీటర్లు, ఇరాన్లో 1,866 లీటర్ల డీజిల్ కొనుగోలు చేయవచ్చని తెలిపింది. చమురు ఉత్పత్తి చేసే దేశాలైన కువైట్, వెనిజువెలా, ఖతార్, ఇరాన్, లిబియాలో ఒకరోజు జీతంతో 200 లీటర్ల పెట్రోలు లేదా డీజిల్ కొనుగోలు చేయవచ్చని వివరించింది.
ఇంధన ధరల మోత
గత రెండు నెలల కాలంలో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడు విడతల్లో లీటరు పెట్రోలు లేదా డీజిల్‌పై రూ.7 పెంచింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు aధరలు పెరిగాయం టూ ఆ భారాన్ని దేశ ప్రజలపై మోపింది. నిజానికి ఈ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో మూడు ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు రూ.19,470 కోట్ల లాభాలు ఆర్జించినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం కంటే 40.74 శాతం అధికమని తెలుస్తున్నది. మార్చి నెలలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న పరిస్థితుల్లోనే భారత్‌లోని మూడు కంపెనీలు వేల కోట్ల లాభాలను పొందినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అయినప్పటికీ చమురు కంపెనీలకు నష్టాలు వస్తున్నాయంటూ భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచివేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

