Snowfall | భూతల స్వర్గం జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో గత రెండు రోజులుగా భారీగా మంచు (Snow) కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ (Gulmarg) పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది (Snow blanket). నిరంతరం మంచు వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు, ఇళ్లను మంచు కప్పేసింది. స్కీయింగ్ సిటీ ఎటు చూసినా శ్వేత వర్ణం సంతరించుకుని పర్యాటకులను (Tourists) ఆహ్వానిస్తోంది. స్థానికులు, పర్యాటకులు శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
#WATCH | Jammu and Kashmir | Gulmarg turns into a white wonderland as it witnesses a fresh spell of snow. pic.twitter.com/OpCCH2S9x2
— ANI (@ANI) November 5, 2025
గుల్మార్గ్తోపాటూ ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సోనామార్గ్, జోజిలా, గగాంగిర్, కుప్వారాలో కూడా మంచు పడుతోంది. శ్రీనగర్ వాతావరణ కేంద్రం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో గుల్మార్గ్లో 7.6 సెంటీమీటర్ల మేర మంచు పడింది. దక్షిణ కశ్మీర్లోని పహల్గామ్లో కూడా గత 24 గంటల్లో 2.1 సెంటీమీటర్ల మంచు, 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సమ్మర్ క్యాపిటల్ శ్రీనగర్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం, మంచు కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
Gulmarg, the famed ski resort in north Kashmir, woke up under a fresh blanket of snow, marking the season’s first major snowfall and painting the valley in white charm.
Photography by Mubashir Khan for Greater Kashmir pic.twitter.com/rn7Z8YxRTb
— Greater Kashmir (@GreaterKashmir) November 5, 2025
Morning ❄️#Gulmarg #snowfall pic.twitter.com/USjHNUeWCh
— Farhat Naik (@Farhat_naik_) November 5, 2025
Season’s first snowfall 🤍
📍 Gulmarg Kashmir pic.twitter.com/61x27Lwqxl— Bisoprolol💗 (@bisoheart) November 4, 2025
VIDEO | Gulmarg: Fresh snowfall blankets the hill station, transforming Gulmarg into a winter wonderland. Many areas in the higher reaches of Kashmir, including the tourist resorts of Gulmarg and Sonamarg, received fresh snowfall on Tuesday, while rains lashed the plains.
(Full… pic.twitter.com/4DWqZlFyOH
— Press Trust of India (@PTI_News) November 5, 2025
Also Read..
Hindus Denied Entry By Pak | భారతీయ హిందువులను.. వెనక్కి పంపిన పాక్
Bihar polls | ఎన్డీయే కూటమికి 60 సీట్లు కూడా రావు : ఆర్జేడీ
Rahul Gandhi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన బ్రెజిల్ మోడల్