Viral Video | మహిళలకు చీరలు, ఆభరణాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎన్ని చీరలు, ఆభరణాలు ఉన్నా సరిపోవు వారికి. ఇంకా కొనాలనే ఆశ. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చిన కొత్త చీరలు, ట్రెండీ నగలను తమ సొంతం చేసుకుంటుంటారు. నచ్చితే ధర ఎంతైనా సరే వెనుకాడరు. అలాంటిది.. డిస్కౌంట్లో మంచి చీరలు తక్కువ ధరకే వస్తున్నాయంటే ఎక్కడున్నా సరే ఆ షాపుకు పరుగున వెళ్తారు. తమకు నచ్చిన చీరను డిస్కౌంట్లో కొనుక్కొని మురిసిపోతారు. అలా డిస్కౌంట్లో వచ్చే ఓ చీర కోసం ఇద్దరు మహిళలు తాజాగా కొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు (Bengaluru)లోని మల్లేశ్వరం (Malleshwaram) ప్రాంతంలో ఉండే మైసూరు సిల్క్ శారీ సెంటర్ (Mysore Silk Saree Centre) ఇటీవల డిస్కౌంట్ ధరలతో ఇయర్లీ శారీ సేల్ (Yearly Saree Sale) నిర్వహించింది. బయట మార్కెట్ కంటే తక్కువ ధర ఉండటం, చీరలు కూడా బాగుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు మహిళలు ఆ దుకాణానికి క్యూ కట్టారు. తమకు నచ్చిన చీరలను బుట్టలో వేసుకోవడం మొదలు పెట్టారు. అందులో ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. అంతే, ఇంకేముంది.. ఆ చీర నాకు కావాలని ఒకరంటే.. కాదు నాకు కావాలి అని మరో మహిళ గొడవకు దిగారు. అది కాస్తా ముదిరి ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకునేవరకు వెళ్లారు. వారిని అదుపు చేసేందుకు అక్కడున్న సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.👆🤦♀️RT pic.twitter.com/4io5fiYay0
— RVAIDYA2000 🕉️ (@rvaidya2000) April 23, 2023
Also Read..
Sudan Crisis | సుడాన్ అల్లర్లలో 400 మంది మృతి.. ప్రమాదంలో చిన్నారుల జీవితం
American Airlines | విమానం గాల్లో ఉండగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం