American Airlines | అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines )కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఫ్లైట్ గాల్లో (mid air) ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ (emergency landing) చేశారు. వివరాల్లోకి వెళితే..
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 బోయింగ్ విమానం ఒహాయె (Ohio)లోని కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Columbus International Airport) నుంచి ఫీనిక్స్కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన 25 నిమిషాలకే ఓ పక్షుల గుంపు దాన్ని ఢీ కొట్టింది. దీంతో విమానం కుడి వైపునున్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చి.. అనంతరం మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని కొలంబస్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం కొలంబస్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత అందులోని ప్రయాణికులను మరో విమానంలో అక్కడి నుంచి తరలించారు.
American Airlines 737 returns to Columbus Airport after striking a number of geese on departure. AA1958 to Phoenix landed back safely 25 minutes after takeoff. pic.twitter.com/ws3wi3Cl9D
— Breaking Aviation News & Videos (@aviationbrk) April 23, 2023
Taken from Upper Arlington, Ohio. AA1958. pic.twitter.com/yUSSMImaF7
— CBUS4LIFE (@Cbus4Life) April 23, 2023
Emergency crews responded to an aircraft incident at CMH this morning involving a reported engine fire. The aircraft landed safely and the airport is open and operational. pic.twitter.com/EeCJzfbVjA
— John Glenn Intl Airport (@columbusairport) April 23, 2023
Also Read..
Hyderabad | ఊరెళ్తున్నారా? సమాచారం ఇవ్వండి.. వచ్చేదాకా గస్తీ పెంచుతాం : సైబరాబాద్ సీపీ
Telangana | ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి.. డ్రైనేజీలో మృతదేహం లభ్యం
Twitter Blue tick | బ్లూ టిక్ మళ్లీ వచ్చేసింది.. 10 లక్షల ఫాలోవర్లుంటే ఫ్రీ