జైపూర్: అత్యంత కిరాతకంగా పద్నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం ఆమెను సజీవంగా ఇటుక బట్టీ మంటల్లో పడేసిన ఇద్దరు అన్నదమ్ములకు రాజస్థాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో ఏడుగురు నిందితులు నిర్దోషులని ప్రకటించింది. పోక్సో ప్రత్యేక కోర్టు ఈ తీర్పునిచ్చింది. గత ఏడాది ఆగస్టు 2న బాధితురాలు మేకలను మేపడం కోసం వెళ్లింది. ఆ తర్వాత ఆమె కనిపించలేదు. దీంతో ఆమె కోసం ఆమె తల్లిదండ్రులు, బంధువులు వెతికారు. ఆమె చేతికి ధరించే కడియం, చెప్పులు ఓ ఇటుకల బట్టీ బయట కనిపించాయి. ఓ చెరువులో సగం కాలిన శరీర భాగాలు కనిపించాయి. పదిమందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. కొందరు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహావీర్ సింగ్ కిష్ణవత్ తెలిపారు.