ముంబై : మహారాష్ట్ర ముంబై నాయక్‌నగర్‌లో సోమవారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడారు. భవనం శిథిలాల కింద చిక్కుకుపోయిన ఏడుగురిని ఏడుగురి రక్షించారు. ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. అయితే, శిథిలాల కింద 20 నుంచి 25 మంది చిక్కుకుపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.
అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో భవనం కుప్పకూలగా.. సంఘటనా స్థలాన్ని మంత్రి ఆదిత్య థాకరే సందర్శించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేస్తే వెంటనే భవనాలు ఖాళీ చేయాలని, లేదంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయన్నారు. ఘటన దురదృష్టకరమన్నారు. అయితే, భవనంలో చిక్కుకుపోయిన వారందరినీ రక్షించడమే మా ప్రాధాన్యం అని, ఉదయం భవనాల్లోని వారిని తరలిస్తామన్నారు. కూల్చివేతలను పరిశీలిస్తామన్నారు. ఇటీవల బాంద్రా వెస్ట్‌లోని శాస్త్రినగర్‌లో భవనం కూలిన ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. 19 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.