Road Accident | కర్ణాటకలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గడక్ జిల్లా నరగుంద తాలూకలో ఆదివారం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు-కారును ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులను రుద్రప్ప అంగడి (58), భార్య రాజేశ్వరి (50), కుమార్తె ఐశ్వర్య (18), కుమారుడు విజయ్ కుమార్ (14)గా గుర్తించారు. వీరి స్వస్థలం హవేరి జిల్లా మారుతీనగర్ వాసులుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు బీజేపీ ఎంపీ, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం ప్రకటించారు. ప్రమాదంపై విచారణ జరిపించాలని.. పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.