అమేథి: బీజేపీ పాలిత యూపీలో దళిత ఉపాధ్యాయుని కుటుంబంలోని నలుగురిని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. మృతుల్లో టీచర్ సునీల్ (35), అతని భార్య పూనమ్, ఐదేండ్లు, 18 నెలల ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన అమేథి జిల్లా అహూర్వ భర్వానిలో గురువారం సాయంత్రం జరిగింది.
ఉపాధ్యాయుడు సునీల్ నివసిస్తున్న అద్దె ఇంట్లోకి నిందితుడు చందన్ వర్మ, కొందరు దుండగులు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చందన్ వర్మ అనే వ్యక్తి తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని టీచర్ భార్య పూనమ్ భారతి ఆగస్టు 18న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.