పాట్నా : బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. నలుగురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. బాలికలు అబ్బాయిలతో కలిసి ఉండటాన్ని చూసిన వారి తల్లిదండ్రులు, బాలికల్ని తిట్టడంతో బలవన్మరణానికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
జనవరి 29న ఇక్కడి హస్పురా పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించకుండా అదే రోజు అంత్యక్రియల్ని చేపట్టడం అనుమానాలకు తావిచ్చింది.