గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 21:22:58

ఆటో, మినీ ట్రక్కు ఢీ.. నలుగురు మృతి

ఆటో, మినీ ట్రక్కు ఢీ.. నలుగురు మృతి

భోపాల్‌ :  మధ్యప్రదేశ్‌లోని మాండ్ల జిల్లాలో గురువారం ఆటో, మినీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిచియా పోలీస్ స్టేషన్ పరిధిలోని 30వ నెంబర్‌ జాతీయ రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్గో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు, రెండు వాహనాల డ్రైవర్లు ప్రమాదంలో మరణించారని మండ్లా జిల్లా అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ విక్రమ్‌సింగ్‌ కుష్వాహ పేర్కొన్నారు. రెండు వాహనాలు చాలా బలంగా ఢీకొట్టుకున్నాయని, మృతదేహాలను బయటకు తీసేందుకు గ్యాస్‌ కట్టర్లను వినియోగించనట్లు కుశ్వాహ చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo