Governor CV Anand | గవర్నర్ లైంగిక వేధింపులపై రాష్ట్రపతిని ఆశ్రయిస్తా.. బెంగాల్ రాజ్‌భవన్ ఉద్యోగిని
తనపై పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ అనంద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపించిన రాజ్‌భవన్ ఉద్యోగిని.. న్యాయం కోసం రాష్ట్రపతి ముర్ము జోక్యాన్ని కోరుతానని శుక్రవారం వెల్లడించారు. రాజ్యాంగపరంగా రక్షణ ఉన్న గవర్నర్‌పై దర్యాప్తులో పోలీసులు ముందుకు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని అన్నారు.
Governor CV Anand | కోల్‌కతా, మే 10: తనపై పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ అనంద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపించిన రాజ్‌భవన్ ఉద్యోగిని.. న్యాయం కోసం రాష్ట్రపతి ముర్ము జోక్యాన్ని కోరుతానని శుక్రవారం వెల్లడించారు. రాజ్యాంగపరంగా రక్షణ ఉన్న గవర్నర్‌పై దర్యాప్తులో పోలీసులు ముందుకు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని అన్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి గవర్నర్ రాజ్‌భవన్‌లో ఎడిట్ కాని సీసీ ఫుటేజ్‌లను కొందరికి ప్రదర్శించి చూపారని, అందులో బాధితురాలినైన తన ముఖాన్ని బ్లర్ చేయకుండానే ఫుటేజ్‌ను ప్రదర్శించారని ఆరోపించారు.
ఇది తనను అవమానించడం, గౌరవానికి భంగం కలిగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని సంప్రదిస్తారా? అని అడుగగా, తన ఉదంతంపై మోదీకి సమాచారం వెళ్లిందనే భావిస్తున్నానని, అయితే ఎలాంటి స్పందన లేదని, దీని గురించి ఆయనకు విజ్ఞప్తి చేయడం వృథా అని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

