న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందగా, 28 మందికి పైగా గాయపడ్డారు. బుద్గాం జిల్లాలో శుక్రవారం భద్రతా దళాలను తీసుకువెళ్తున్న బస్ బ్రిల్ బుద్గాం గ్రామ సమీపంలో అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
వెంటనే స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానలకు తరలించారు. జమ్ముకశ్మీర్లో ఈ నెల 25న జరిగే రెండో విడత ఎన్నికల బందోబస్తుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.