e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, November 30, 2021
Home News Aziz Qureshi : మాజీ గవర్నర్‌పై రాజద్రోహం కేసు

Aziz Qureshi : మాజీ గవర్నర్‌పై రాజద్రోహం కేసు

లక్నో : ఉత్తరప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ అజీజ్‌ ఖురేషిపై (Aziz Qureshi) రాజద్రోహం కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు. రాంపూర్‌ ఎమ్మెల్యే ఆజామ్‌ఖాన్‌, ఆయన భార్య తంజీమ్‌ ఫాతిమాను కలిసేందుకు వారి ఇంటికి వెళ్లిన ఖురేషి.. అక్కడ యోగి ఆదిత్యనాథ్‌తోపాటు బీజేపీ ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు మామూలు మనుషులు కాదు.. దయ్యాలు, రక్తం పీల్చే రాక్షసులు..’ అంటూ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వివాదాస్పదమైంది.

రాంపూర్‌ జిల్లాలోని సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్లో ఖురేషిపై బీజేపీ కార్యకర్త ఆకాశ్‌ సక్సేనా ఫిర్యాదు దాఖలు చేశారు. మాజీ గవర్నర్‌ వ్యాఖ్యలు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలను సృష్టించే విధంగా, మత కల్లోలాలను రేకెత్తించేలా ఉన్నాయని బీజేపీ కార్యకర్త సక్సేనా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఖురేషిపై ఐపీసీ సెక్షన్‌ 124 ఏ, 153 ఏ, 153 బీ, 505(1)(బీ) కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

- Advertisement -

అజీజ్ ఖురేషి గతంలో కూడా వివాదాస్పద ప్రకటనలు చేశారు. పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ముందస్తు ప్రణాళిక అని ఆయన గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

రక్తపోటు పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!

ట్రిబ్యునల్స్‌ ఖాళీలు భర్తీ చేయకపోవడంపై ‘సుప్రీం’ ఆగ్రహం

బ్రిటన్‌ ఎంపీలకు కొత్త డ్రెస్‌ కోడ్‌

తేజ్‌ ప్రతాప్‌ ‘స్టూడెంట్‌ జన్‌శక్తి పరిషత్‌’ ప్రారంభం

తాలిబాన్‌ క్రూరం.. మాజీ మహిళా పోలీసు అధికారి దారుణహత్య

లాహోర్‌ను ముట్టడించిన భారత సేనలు

107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement