Rishi Sunak | బ్రిటన్ మాజీ ప్రధాని, భారత సంతతికి చెందిన రిషి సునాక్ (Rishi Sunak) బెంగళూరు (Bengaluru)లో మెరిశారు. తన భార్య అక్షతా మూర్తి (Akshata Murty)తో కలిసి ఓ కాఫీ షాప్‌లో సందడి చేశారు. స్థానికులతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఆకట్టుకున్నారు.
రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఇటీవలే బెంగళూరులోని థర్డ్ వేవ్ కాఫీ (Third Wave Coffee) షాప్‌లో కాఫీ డేట్‌ను ఆస్వాదించారు. ఇద్దరూ టేబుల్ వద్ద కాఫీని ఎంజాయ్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఆ సమయంలో కాఫీ షాప్‌కు వెళ్లిన స్థానికులు రిషి సునాక్ జంటను చూసి థ్రిల్ అయ్యారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, రిషి సునాక్ 2022 నుంచి 2024 వరకు యూకే ప్రధాన మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఓటమి చవి చూసింది.
Lot happened over coffee! Rishi Sunak, MP and former UK PM, and Akshata Murthy were spotted at Third Wave Coffee in Namma Bengaluru. ☕🇮🇳 #Bengaluru #RishiSunak #AkshataMurthy
PC : @vinaykoppad pic.twitter.com/hFkgR9Lu4H
— North BangalorePost (@nBangalorepost) November 7, 2024
ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy), సుధామూర్తి (Sudha Murty) కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో విజయవంతంగా ఓ సాఫ్ట్వేర్ సంస్థను నడుపుతున్నప్పటికీ సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటారు. వీరి కుమార్తే అక్షతా మూర్తి. అక్షత.. రిషి సునాక్‌కు ప్రేమ వివాహం చేసుకుంది. రిషి యూకే ప్రధానిగా ఉన్న సమయంలో అక్షతా మూర్తి బెంగళూరు వీధుల్లో తన తండ్రితో కలిసి షాపింగ్ చేసిన విషయం తెలిసిందే. తండ్రి నారాయణమూర్తి, తల్లి సుధామూర్తి, ఇద్దరు కుమార్తెలు అనౌష్క, కృష్ణతో కలిసి నగరంలోని రాఘవేంద్ర మఠాన్ని సందర్శించారు. అయితే, ఆ టైంలో ఎలాంటి భద్రత లేకుండా సాధారణ పౌరుల్లా అక్కడ మొత్తం కలియతిరగడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు పలు సందర్భాల్లోనూ వీరు సిలికాన్ సిటీలో సందడి చేశారు.
Also Read..
Elon Musk | విక్టరీ సెలబ్రేషన్స్.. ట్రంప్ ఫ్యామిలీ ఫొటోలో ఎలాన్ మస్క్.. వైరలవుతున్న పిక్
Saudi Arabia | ఎడారిలో మంచు వర్షం.. చరిత్రలోనే తొలిసారి.. ఫొటోలు, వీడియోలు వైరల్
Stubble Burning | కేంద్రం కీలక నిర్ణయం.. పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులకు రెట్టింపు జరిమానా