Pranab Mukherjee | కీ.శే. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రీయ స్మృతి కాంప్లెక్స్‌లో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ మంగళవారం నిర్ణయించింది. భారత్ రత్న ప్రణబ్ ముఖర్జీకి స్మారకం ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రధాని నరేంద్రమోదీకి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ట ముఖర్జీ ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబం అడగకుండానే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తన హృదయాన్ని తాకిందని పేర్కొన్నారు.
‘అధికారిక గౌరవం కల్పించాలని కోరవద్దని బాబా (ప్రణబ్ ముఖర్జీ) చెప్పేవారు. కానీ, అధికారిక లాంఛనాలతో నిర్వహించాలి. నా తండ్రి గౌరవార్ధం స్మారకం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు నేను ధన్యురాలిని. ప్రశంసించడానికి లేదా విమర్శించడానికి బాబా అతీతుడు. కానీ ఆయన కూతురుగా నా సంతోషాన్ని వెల్లడించడానికి ఈ పదాలు సరిపోవు’ అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.