Arvind Limbavali | బెంగళూరు, జూలై 27: సొంత పార్టీపై కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావళి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక మధ్యలో సఖ్యత, అవగాహన లేకపోవడం విచారకరమని అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ముడా కుంభకోణం, వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్, ఎస్సీ, ఎస్టీ నిధుల దుర్వినియోగం వంటి అంశాలను మా పార్టీ నేతలు సమర్థవంతంగా ప్రస్తావించడంలో విఫలమయ్యారు. బీజేపీ అధికార కాంగ్రెస్తో కుమ్మక్కు అయిందా? అని ప్రజలు చర్చించుకొంటున్నారు’ అని ఆయన అన్నారు.