న్యూఢిల్లీ: డీఆర్డీవో మాజీ డైరెక్టర్ వీఎస్ అరుణాచలం (87) బుధవారం అమెరికాలో కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని తన ఇంటిలో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాబా అటామిక్ రిసెర్చ్, నేషనల్ ఏరోనాటికల్, డిఫెన్స్ మెటలార్జికల్ ల్యాబొరేటరీలలో ఆయన పనిచేశారు.
1982-92 మధ్య డీఆర్డీవో చీఫ్గా, రక్షణ శాఖ సలహాదారుగా వ్యవహరించారు. ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీలో సేవలను గుర్తిస్తూ అరుణాచలంకు కేంద్రం పద్మభూషణ్ (1985), పద్మవిభూషణ్ (1990) అందజేసింది. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు.