తిరుమల : ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు (Tirumala) చేరుకున్న కేజ్రీవాల్ దంపతులు గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీసమేతంగా స్వామివారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు కేజ్రీవాల్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆయన మీడియాత మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అదేవిధంగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ( Kollu Ravindra) స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో తిరుమలలో చాలా అపచారాలు జరిగాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకు పవిత్రతో పునరుద్దరణ జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కలగాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు.