న్యూఢిల్లీ: ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ఎల్యూ) ప్రొఫెసర్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గురువారం నియమితులయ్యారు. భారతీయ న్యాయ విద్యలోఇదో వినూత్న అధ్యాయమని ఎన్ఎల్యూ ఈ సందర్భంగా ప్రకటించింది.
జస్టిస్ చంద్రచూడ్ నియామకంతో తమ యూనివర్సిటీ విద్యా విధానం సుసంపన్నం కాగలదని ఎన్ఎల్యూ వైస్ చాన్సలర్ జీఎస్ బాజ్పాయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నియామకాన్ని పురస్కరించుకుని ఎన్ఎల్యూ రాజ్యాంగ అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పనున్నది.