ముంబై, అక్టోబర్ 25: మహారాష్ట్రలో స్థానిక, పురపాలక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రెవెన్యూ మంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అందరి మొబైల్ ఫోన్లపై నిఘా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఆయన వ్యాఖ్యలు రాజకీయ వివాదాన్ని రేపాయి. దీనిపై వెంటనే స్పందించిన శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీ మంత్రి బావన్కులేని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.నాయకుల ఫోన్లనే కాక ప్రజల మొబైల్ ఫోన్లపై కూడా మహాయుతి ప్రభుత్వం నిఘా పెట్టిందని రౌత్ ఆరోపించారు.