న్యూఢిల్లీ, జనవరి 8 : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా గడువును భారత్ పొడిగించింది. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన హసీనా ఆగస్టు నుంచి భారత్‌లోనే ఉంటున్నారు. ఆమెను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న క్రమంలో హసీనా వీసా గడువును భారత్ పొడిగించడం గమనార్హం. ఇలావుండగా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షురాలు అయిన 79 ఏండ్ల ఖలీదా జియా వైద్య చికిత్స కోసం మంగళవారం లండన్‌కు వెళ్లారు. ప్రత్యేక రాయల్ అంబులెన్స్‌లో లండన్‌కు వెళ్లే ముందు పలువురు అభిమానులు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.