తిరువనంతపురం: కేరళలోని పద్మనాభస్వామి ఆలయాన్ని(Kerala Temple) విజిట్ చేయాలనుకున్న ఓ విదేశీ మహిళకు అనుమతి దక్కలేదు. కాబోయే భర్తతో వచ్చిన ఆమె.. చీర కట్టుకుని ఆలయాన్ని సందర్శించాలనుకున్నది. కానీ అక్కడ ఉన్న సెక్యూర్టీ.. ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. కేవలం హిందువులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుందని అధికారులు చెప్పినట్లు ఆమె ఓ వీడియోలో పేర్కొన్నది. తనతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఆమె భాయ్‌ఫ్రెండ్ చెప్పినా.. ఆలయ సిబ్బంది ఆ విదేశీ మహిళకు ఎంట్రీ అనుమతి ఇవ్వలేదు.
హర్‌ప్రీత్ అనే మహిళ తన ఎక్స్ అకౌంట్లో విదేశీ మహిళ వీడియోను పోస్టు చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె వీడియో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కూడా ఆ వీడియోను షేర్ చేస్తూ రియాక్ట్ అయ్యారు. ప్రార్థనా స్థలానికి వెళ్లాలనుకుంటున్న వ్యక్తులను ఎందుకు నిషేధించాలని కార్తీ ప్రశ్నించారు. తాను హిందువునే అని ఆ మహిళ వీడియోలో చెప్పుకున్నది. కానీ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ ఆలయ అధికారులు కోరారు.
భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నానని, భగవద్గీతను చదవుతానని, అయినా కానీ సెక్యూర్టీ గార్డులు తనను ఓ క్రిమినల్లా చూస్తున్నారని ఆమె తన వీడియోలో ఆరోపించారు. ఆలయ అధికారులు వర్ణవివక్షను ప్రదర్శించినట్లు ఆ మహిళ ఆరోపించింది. కేవలం ఆలయంలో ప్రవేశించేందుకు మాత్రమే చీరను కొన్నట్లు ఆమె చెప్పుకున్నది. ఆ వీడియోకు అనుకూలంగా కొందరు కామెంట్ చేయగా, సంప్రదాయాలను గౌరవించాలని కొందరు పేర్కొన్నారు.
I feel bad for her. She was super excited after wearing saari and visiting temple with her husband but she wasn’t allowed at temple. She was even saying she is Hindu.
Straight big NO. She is not first or last, it is the rule in most big temples. pic.twitter.com/ywU4XrMDBS
— Harpreet (@harpreet4567) July 14, 2024