న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ గగనతలాన్ని విదేశీ ఎయిర్లైన్స్ వినియోగించడం లేదు. జర్మనీ వైమానిక సంస్థ లుఫ్తాన్సా గ్రూప్ గురువారం స్పందిస్తూ, తమ విమానాలు పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణించబోవని తెలిపింది.
దీనివల్ల భారత్ సహా ఆసియా దేశాలకు ప్రయాణ సమయం పెరుగుతుందని చెప్పింది. ప్రయాణికులు తమ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా వివరాలను తెలుసుకోవాలని సూచించింది. తమ విమానాలు పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణించబోవని బ్రిటన్లోని వర్జిన్ అట్లాంటిక్ తెలిపింది. దీనివల్ల లండన్-ఢిల్లీ విమానాలను వేరొక మార్గంలో నడుపుతామని ప్రకటించింది.