లక్నో: ఎన్నికల మార్గదర్శకాలు ఉల్లంఘించినట్లు పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆదేశించింది. (EC suspends UP police personnel) ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలకు సూచించింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని సిసమావు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బుధవారం పోలింగ్ జరిగింది.
కాగా, ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు ఓటర్లను వేధిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. చట్టవిరుద్ధంగా ఓటరు కార్డులు, ఆధార్ ఐడీలను తనిఖీ చేస్తున్న పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈసీకి ఫిర్యాదు చేయడంతోపాటు వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మరోవైపు ఈ ఆరోపణలపై ఈసీ స్పందించింది. ఎన్నికల మార్గదర్శకాలు ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు చేపట్టింది. ఎన్నికల విధుల్లో మోహరించిన పోలీసుల్లో ఆరోపణలు వచ్చిన వారిని సస్పెండ్ చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. దీంతో ఏడుగురు పోలీస్ అధికారులపై చర్యలు చేపట్టారు. కాన్పూర్, ముజఫర్‌నగర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, మొరాదాబాద్‌లో ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు.
अगर निर्वाचन आयोग का कोई जीता-जागता अस्तित्व है तो वो जीवंत होकर, प्रशासन के द्वारा वोटिंग को हतोत्साहित करने के लिए तुरंत सुनिश्चित करे:
– लोगों की आईडी पुलिस चेक न करे।
– रास्ते बंद न किये जाएं।
– वोटर्स के आईडी ज़ब्त न किये जाएं।
– असली आईडी को नक़ली आईडी बताकर जेल… pic.twitter.com/4Qddtlgc19— Akhilesh Yadav (@yadavakhilesh) November 20, 2024
मीरापुर के ककरौली थाना क्षेत्र के SHO को चुनाव आयोग तुरंत निलंबित किया जाए, क्योंकि वो रिवॉल्वर से धमकाकर वोटर्स को वोट डालने से रोक रहे हैं। @ECISVEEP @SECUttarPradesh@rajivkumarec@spokespersonECI@ceoup#ECI#YouAreTheOne#IVoteForSure#UPPolitics#SamajwadiParty pic.twitter.com/WfiygzqO0t
— Akhilesh Yadav (@yadavakhilesh) November 20, 2024