DK Shivakumar: డీకే శివకుమార్ హెలికాప్టర్లో.. ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు
DK Shivakumar: డీకే శివకుమార్ ప్రయాణించిన హెలికాప్టర్లో ఇవాళ ఎన్నికల సంఘం అధికారులు సోదాలు చేపట్టారు. ధర్మస్థలి హెలిప్యాడ్‌లో చాపర్‌ను చెక్ చేశారు. ఈసీ అధికారులు తన హెలికాప్టర్‌ను సెర్చ్ చేయడంలో తప్పేమీలేదని డీకే శివకుమార్ తెలిపారు.
బెంగుళూరు: కర్నాటకలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. మే 10వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో .. ఆయా పార్టీలకు చెందిన నేతలు ఉగ్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(DK Shivakumar) ప్రయాణించిన హెలికాప్టర్‌లోనూ ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
#WATCH | Flying squad of ECI and officials conducted a check of the helicopter used by State Congress president DK Shivakumar after it reached the helipad at Dharmasthala in Dakshina Kannada. The party's state chief was travelling in the chopper.
"Nothing wrong in that. They… pic.twitter.com/CTB2i9o0LR
— ANI (@ANI) April 22, 2023
ప్రచారం కోసం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలికి చేరుకున్న తర్వాత.. హెలిప్యాడ్‌లోనే శివకుమార్ ప్రయాణించిన హెలికాప్టర్‌ను చెక్ చేశారు. ఆ చాపర్‌లో తమ పార్టీ చీఫ్ ప్రయాణించినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించంది. సోదాలు చేయడంలో తప్పులేదని, వాళ్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లు డీకే శివకుమార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

