ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 15:18:27

బీహార్‌ను ముంచెత్తుతున్న వరదలు

బీహార్‌ను ముంచెత్తుతున్న వరదలు

ప‌ట్నా : బీహార్‌ను వరదలు మెంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆనకట్టలు తెగిపోయి ప‌లు గ్రామాలు నీట‌మునిగాయి. సమస్తిపూర్ రైల్వే వంతెన కింద నీటిమట్టం పెరగడంతో రైలు ప‌ట్టాలు మునిగిపోయాయి. హయాఘాట్ స్టేషన్ సమీపంలో కోసి నది ప్రవాహం మ‌రింత పెరిగింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సమస్తిపూర్- దర్భాంగా మార్గంలో ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌ను‌ నిలిపివేయాల‌ని రైల్వే అధికారులు నిర్ణయించారు.

మ‌రోవైపు రైళ్లను దారిమళ్లించారు. వరదల కారణంగా నార్కటియాగంజ్-సుగౌలీ మధ్య రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్పండింది. బాగ్‌మ‌తి, ఘాఘ్రా, గండక్, బుధి త‌దిత‌ర నదులు బీహార్‌లో ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. నదుల నీటి మట్టం పెరగడంతో బీహార్‌లోని 10 జిల్లాలు వరద తాకిడికి గుర‌య్యాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo