మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 11:44:51

అసోంలో వ‌ర‌దలు.. 123కు చేరిన మృతులు

అసోంలో వ‌ర‌దలు.. 123కు చేరిన మృతులు

గౌహ‌తి : అసోంలో వ‌ర‌ద‌లు తీవ్ర రూపం దాల్చాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిప‌డ‌టంతో పాటు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా వివిధ ఘ‌ట‌న‌ల్లో మరణించిన వారి సంఖ్య 123కు చేరింది. రాష్ట్రంలోని 70 లక్షల మందిపై వ‌ర‌ద‌లు ప్రభావం చూపుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ తాము ఈ విప‌త్తును ఎదు‌ర్కొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామ‌న్నారు. బాధితుల‌కు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాయన్నారు. ఒక వైపు కరోనా, మ‌రోవైపు వరదలు అసోంను అత‌లాకుతలం చేస్తున్నాయ‌న్నారు.

వ‌ర‌ద‌ల కార‌ణంగా ప‌లువు‌రు ప్రాణాలు కోల్పోయార‌ని, కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో 109 జంతువులు కూడా చనిపోయాయ‌న్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఇతర బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయ‌ని ఆయన తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo