Flipkart | వాల్‌మార్ట్‌కు చెందిన ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఉద్యోగులకు (employees) షాక్ ఇచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home)కు స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులంతా తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాలని ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ మనీ కంట్రోల్ నివేదించింది.
కరోనా మహమ్మారి కారణంగా 2019లో దాదాపు అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. ఇటీవలే మహమ్మారి తగ్గిపోవడంతో పలు సంస్థలు హైబ్రిడ్ పద్ధతిలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా డబ్ల్యూఎఫ్‌హెచ్‌కు ముగింపు పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ సైతం వర్క్‌ఫ్రమ్ హోమ్ పాలసీకి ముగింపు పలకాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదట సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ఆఫీసుకు రవాల్సిందిగా ఆదేశించింది. ఇప్పుడు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు వచ్చి పని చేయాలని తెలిపింది.
Also Read..
Gauri Khan | గౌరీఖాన్ రెస్టారెంట్‌పై ‘ఫేక్ పనీర్’ ఆరోపణలు.. స్పందించిన టోరి యాజమాన్యం