Flight operations resume | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ (Srinagar airport)లో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి (Flight operations resume). భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలతో ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో దాదాపు 32 విమానాశ్రయాలను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో సోమవారం ఆయా విమానాశ్రయాలు తిరిగి తెరుచుకున్నాయి.
శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా అధికారులు నిన్ననే తెరిచినప్పటికీ విమాన కార్యకలాపాలు మాత్రం మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇవాళ తొలి విమానం ఎయిర్ ఇండియాకు చెందిన AI 827 విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు ఆరు రోజుల తర్వాత ఈ ఎయిర్‌పోర్ట్‌లో విమాన కార్యకలాపాలు మొదలు కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
32 ఎయిర్‌పోర్టులు రీఓపెన్
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలతో ఉత్తర, వాయువ్య ప్రాంతాలలో మూసివేసిన 32 ఎయిర్‌పోర్టులను తిరిగి తెరిచినట్టు భారత విమానయాన నియంత్రణ సంస్థ సోమవారం ప్రకటించింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. శ్రీనగర్, ఛండీగఢ్, అమృత్‌సర్‌లో విమానాల రాకపోకలు ప్రారంభమైనట్టు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) స్పష్టం చేసింది. ప్రయాణికులు విమానాల స్టేటస్ కోసం ఆయా సంస్థల ఎయిర్‌లైన్స్‌లను నేరుగా లేదా వారి వెబ్సైట్ల ద్వారా వివరాలను తెలుసుకోవాలని ఏఏఐ సూచించింది.
Also Read..
CJI Sanjiv Khanna | నేడు పదవీ విరమణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. నూతన సీజేఐగా జస్టిస్ గవాయ్
CBSE Class 10 Result | సీబీఎస్ఈ పది ఫలితాలు కూడా వచ్చేశాయ్..
Operation Sindoor | భారత్ దాడిలో 11 మంది సైనికులు చనిపోయారు : పాకిస్థాన్