ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం భారీగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. (Flight operations hit in Mumbai) వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో 350కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. రెండు విమానాలను దారి మళ్లించారు. సుమారు 15 విమానాలు ల్యాండింగ్ కోసం గాలిలో చక్కర్లుకొట్టాయి. శనివారం తెల్లవారుజామున ముంబైలో భారీ వర్షం కురిసింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కాగా, ఫ్లైట్రాడార్ డాటా ప్రకారం ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరే 283 విమానాలు ఆలస్యంగా టేకాఫ్ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన 77 విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యమయ్యాయి. శనివారం ఉదయం ముంబైకి చేరుకోవాల్సిన రెండు విమానాలను నాగ్‌పూర్, అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు. ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన 15 విమానాలు ప్రతికూల వాతావరణం వల్ల గాలిలో రౌండ్లు కొట్టాయి.
మరోవైపు ఇండిగోకు చెందిన ఎయిర్‌బస్ ఏ321 విమానం శనివారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం ప్రయత్నించింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్లు ల్యాండింగ్‌ను విరమించారు. ఆ విమానం తిరిగి గాలిలోకి లేచే సమయంలో తోక భాగం రన్‌వేను తాకింది. ఆ తర్వాత గాలిలో ఒక రౌండ్ తిరిగిన ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు డీజీసీఏ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.
Also Read:
IndiGo Aircraft’s Tail Hits Runway | ల్యాండింగ్ సమయంలో.. రన్‌వేను తాకిన ఇండిగో విమానం తోక భాగం
Man Tied To Pole Thrashed | అల్లున్ని స్తంభానికి కట్టేసి కొట్టి.. రాత్రంతా అలాగే ఉంచిన అత్తమామలు