తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్ సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. వాహన శ్రేణిలోని ఐదు కార్లు ఒకదాని వెనుక మరొకటి ఢీకొట్టాయి. పోలీస్ ఎస్కార్ట్ వాహనం, సీఎం కారు, అంబులెన్స్ కూడా ప్రమాదానికి గురైనవాటిలో ఉన్నాయి. తిరువనంతపురం జిల్లా, వామనపురం వద్ద జరిగిన ఈ ప్రమాదం నుంచి సీఎం సహా అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ గాయాలు కాలేదు. పినరయి విజయన్ వేరొక వాహనంలో వెళ్లిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతున్నది.