బెంగళూరు : కర్ణాటకలోని నేలమాకనహళ్లీ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ – ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ సంభవించింది.