Road Accident | రాజస్థాన్లో (Rajasthan) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బికనీర్ (Bikaner) జిల్లాలోని సిఖ్వాల్ ప్రాంతంలో రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జాతీయ రహదారి 11పై ఈ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు రెండు కార్లలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఖతుష్యం ఆలయ (Khatushyam Temple) సందర్శనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో కార్లు రెండూ నుజ్జునుజ్జు అయ్యాయి. కార్లల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు విద్యుత్ కట్టర్లను ఉపయోగించాల్సి వచ్చింది. కార్లలో ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు దాదాపు గంట సమయం పట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మృతులను మనోజ్ జాఖర్, కరణ్, సురేంద్ర కుమార్, దినేష్, మదన్ సరన్గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Bomb Threat | అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
Jagdeep Dhankhar | ధన్ఖడ్ రాజీనామా.. ప్రధాని మోదీ స్పందన ఇదే..
Apache Helicopters | అమెరికా నుంచి భారత్కు చేరుకున్న అపాచీ అటాక్ హెలికాప్టర్లు