ఉన్నావ్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ఉన్నావ్‌లో బస్సు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ కారును ఢీకొన్న బస్సు.. ఆ తర్వాత కింద పడిపోయింది. ఈ దుర్ఘటనలో 5 మంది మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బంగరమావు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న దేవ్ఖారి గ్రామం వద్ద ఉదయం 4.30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హర్యానా నుంచి స్లీపర్ బస్సు బీహార్ వెళ్తోంది. ఎదురుగా వస్తున్న ఎర్టిగా కారును ఢీకొన్నది. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పి.. ఎక్స్‌ప్రెస్‌వే రెయిలింగ్‌ను ఢీకొని, రోడ్డు బయట పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఉన్న అయిదుగురు మృతిచెందారు. కారులో ఉన్న మరో నలుగురితో పాటు బస్సులో ఉన్న మరో నలుగురు గాయపడ్డారు. బహుశా బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసు ఆఫీసర్ హర్ష్ మోదీ తెలిపారు.