హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : అస్సాం రాజధాని గువాహటిలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది.
ఈ మేరకు శుక్రవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గువాహటిలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మతో సమావేశమయ్యారు.