హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు త్వరలో రాబోతున్నాయి. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ర్టాలను కలుపుతూ గువాహటి-కోల్కతా మధ్య తొలి రైలును ప్రారంభించేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం ఈ రైళ్లకు దేశ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. దశల వారీగా ముఖ్య పట్టణాల్లో స్లీపర్ కోచ్ రైళ్లను ప్రారంభిస్తారని, హైదరాబాద్ నుంచి కూడా ఈ రైలును ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు.
సదుపాయాలు ఇవీ..
డిజిటల్ ప్యాసింజర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆటోమేటిక్ డోర్స్ కవచ్ సేఫ్టీ సిస్టమ్, క్రాష్ వర్తీ సెమీ పర్మినెంట్ కప్లర్స్, రీ జనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ, కోచ్ల మధ్య ఫైర్ బ్యారియర్ డోర్స్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టమ్స్, ఏరోసల్ బేస్డ్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్, అలాగే అత్యాధునిక మరుగుదొడ్లు, సీసీటీవీ కెమెరాల వంటి సౌకర్యాలు ఈ రైల్లో ఉంటాయి.