జమ్ము, ఏప్రిల్ 8 : జమ్ము కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ప్రారంభించారు. ఈ కేంద్రంతో హిమాలయాల పరిశోధనల్లో భారత్ ముందుంటుందని ఆయన అన్నారు. స్వేచ్ఛా, భూ వాతావరణంలో అతి తక్కువ సాంద్రత కలిగిన ప్రాంతంలోని పరిస్థితులు, మేఘాల నిర్మాణం, వాతావరణ నమూనాలు, వాతావరణ ప్రక్రియలను అధ్యయనం చేయడానికి ఈ కేంద్రం అవకాశాన్ని అందిస్తుంది.