Fire Accident | ఎక్స్‌ప్రెస్ రైలులో చెలరేగిన మంటలు.. మంటలార్పుతున్న రైల్వే సిబ్బంది
Fire Accident | మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని రత్లాం జిల్లా (Rathlam District) లో త్రివేండ్రం-హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (Trivandrum-Hazrat Nizamuddin Rajdhani Express) లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎసీ కోచ్ (AC Coach) నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
Fire Accident : మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని రత్లాం జిల్లా (Rathlam District) లో త్రివేండ్రం-హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (Trivandrum-Hazrat Nizamuddin Rajdhani Express) లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎసీ కోచ్ (AC Coach) నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలార్పుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున కోటా రైల్వే డివిజన్ (Kota Railway Division) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రైలులోని ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో 68 మంది ప్రయాణికులు ఉన్నారు. కంపార్ట్మెంట్ నుంచి పొగ, మంటలు రావడం గమనించిన రైల్వే గార్డ్ లోకోపైలట్‌ను అప్రమత్తం చేశారు. దాంతో రైలును అక్కడే నిలిపివేశారు. రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బోగీల్లోని ప్రయాణికులను కిందకు దించారు. మంటలు అంటుకున్న బోగీలను రైలు నుంచి వేరుచేశారు. ఫైర్ ఇంజిన్లతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటివరకు ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు కూడా తెలియరాలేదు. ఘటన నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

