Prayagraj | ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాధువుల కోసం వేసిన టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో సంఘటనా స్థలం మొత్తం భారీగా పొగ కమ్మేసింది. మంటలు ఎగిసిపడడంతో భక్తులు దూరంగా వెళ్లిపోయారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాలేదు. సంఘటనా స్థలంలో ఫైర్ ఇంజిన్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. యూపీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8 గంటల వరకు 1.7 మిలియన్లకుపైగా భక్తులు మహాకుంభ మేళాకు హాజరయ్యారు. ఏడో రోజు 1.7 మిలియన్ల మందికిపైగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. జనవరి 18 నాటికి మహా కుంభమేళా సందర్భంగా సంగం త్రివేణిలో 77.2 మిలియన్లకుపైగా యాత్రికులు స్నానాలు చేసినట్లు పేర్కొంది. ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసినా.. భక్తులు భారీగా తరలివచ్చి స్నానాలు ఆచరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్క చేయకుండా తరలివస్తున్నారు. మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది.
#WATCH | Prayagraj, Uttar Pradesh | A fire breaks out at the #MahaKumbhMela2025. Fire tenders are present at the spot.
More details awaited. pic.twitter.com/dtCCLeVIlN
— ANI (@ANI) January 19, 2025