బిగ్ బాస్కెట్ గోదామ్‌లో అగ్నిప్రమాదం..
బిగ్ బాస్కెట్ | బీహార్‌లోని పుణలో ఉన్న ప్రముఖ గ్రాసరీ స్టోర్ గోదామ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పుణెలోని బవ్ధాన్ బద్రుక్ ప్రాంతంలో ఉన్న బిగ్ బాస్కెట్ గోదామ్‌లో ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో

పుణె: బీహార్‌లోని పుణలో ఉన్న ప్రముఖ గ్రాసరీ స్టోర్ గోదామ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పుణెలోని బవ్ధాన్ బద్రుక్ ప్రాంతంలో ఉన్న బిగ్ బాస్కెట్ గోదామ్‌లో ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నగదుతోపాటు గోదామ్‌లో నిల్వ ఉంచిన కూరగాయలు, పప్పు దినులు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 60 మంది సిబ్బంది 12 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికిగల కారణాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు.

కాగా, అగ్నిప్రమాదంలో సుమారు రూ.90 లక్షల విలువైన సరుకు కాలిబూడిదయిందని గోదామ్ నిర్వాహకులు తెలిపారు. దీంతోపాటు గల్లాపెట్టెలో ఉన్న రూ.2 లక్షలు కాలిపోయాయని పోలీసులు తెలిపారు. వ్యాలెట్‌లో మొత్తం రూ.8 లక్షలు ఉన్నాయన్నారు. అయితే ఈ ప్రమాదం ఎవరి ఎలాంటి హానీ జరగలేదని, అందులోపనిచేస్తున్న ఉద్యోగులంతా క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Big Basket
- Bihar
- Fire accident
- Pune
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

